nara - lokeshగత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓటమికి తాను ఒక కారణమే అని… తన మీద జరిగిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో తాను కూడా విఫలం అయ్యాయని టీడీపీ జనరల్ సెక్రటరీ లోకేష్ ఇప్పటికే అంగీకరించారు. ఈ సారి తన వైపు నుండి ఎలాంటి తప్పు జరగకుండా అన్ని విధాలుగా జాగ్రత్తగా ఉంటూ… కార్యకర్తలతో పార్టీ నేతలతో మమేకం అవుతున్నారు లోకేష్.

విజయవాడలోని కృష్ణ లంకలో ఒక మాజీ కార్పొరేటర్ మరణిస్తే … లోకేష్ స్వయంగా అక్కడికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించి వచ్చారు. ఒక్క చిన్నపాటి నేత కుటుంబాన్ని పరామర్శించడానికి లోకేష్ రావడం చర్చనీయాంశం అయ్యింది. పార్టీ క్యాడర్ కు, నేతలకు ఒక పాజిటివ్ మెస్సేజ్ పంపినట్టు అయ్యింది.

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా, గ్రౌండ్ లెవెల్ లో ప్రభుత్వం కారణంగా ఇబ్బంది పడుతున్న కార్యకర్తలకు కూడా లోకేష్ బాగా అందుబాటులో ఉంటున్నరట. వారికి లీగల్ గా హెల్ప్ చెయ్యడం… జైలు లో నుండి విడిపించడం కూడా దగ్గరనుండి చెయ్యడం ఆయనే చేస్తున్నారంట.

మొత్తానికి లోకేష్ రైట్ ట్రాక్ లోనే ఉన్నట్టు ఉంది. అనంతరం అవనిగడ్డ నియోజకవర్గం వెళ్లి అక్కడ నివర్ సైక్లోన్, అకాల వర్షాలతో దెబ్బతిన్న వరి పొలాలను నారా లోకేష్ పరిశీలించారు. రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ రైతులకు అండగా ఉంటుందని లోకేష్ భరోసా కల్పిస్తున్నారు.