Nara Lokesh Complaint on Sakshi News paperనారా లోకేష్ మంత్రిగా ఉండగా ఆయన చిరుతిండికే పాతిక లక్షలు అయ్యాయి అంటూ సాక్షి ప్రచురించిన ఒక వార్తపై నారా లోకేష్ లీగల్ యుద్దానికి సిద్ధం అవుతున్నట్టు సమాచారం. ఉద్దేశపూర్వకంగా తనను రాజకీయంగా అభాసుపాలు చెయ్యడానికి సత్యదూరమైన వార్త ప్రచురించారని, దీనికి ఖండన ఇవ్వాలని లేకపోతే న్యాయపరంగా ఎదురుకుంటామని లోకేష్ సాక్షికి నోటీసు పంపినట్టు సమాచారం.

ఇప్పటికే సాక్షి ప్రచురించిన తేదీలలో తాను విశాఖపట్నం ఎయిర్ పోర్టులో లేను అనే దానికి లోకేష్ ట్విట్టర్ వేదికగా అనేక రుజువులు చూపించారు. రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రోటోకాల్ నాయకులకు, అధికారులకు అయిన ఖర్చు లోకేష్ ఒక్కడి ఖాతాలో చూపించడంతో ప్రజలలో తన పరపతిని సాక్షి దెబ్బ తీసిందని లోకేష్ ఆరోపణ.

ఇది రాజకీయ దురుదేశంతో చేసింది అనేది తెలిసిందే. సాక్షి ప్రచురించిన ఈ వార్తను ఆ తరువాత అనేక పత్రికలలో కూడా వచ్చింది. సోషల్ మీడియాలో కూడా హల్ చల్ చేసేలా చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్. దీనిని ఇక ఉపేక్షించకూడదని లోకేష్ నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తుంది.

అయితే అధికారంలో ఉండగా సాక్షి ఇటువంటి వాటికి తెగబడిన నాడు ఏమీ చెయ్యకుండా వదిలేసి ఇప్పుడు న్యాయపోరాటం వల్ల ఏమి ఉపయోగం అంటూ నిటూరుస్తున్నారు పార్టీ అభిమానులు. అయితే ఈ కేసును సీరియస్ గా అనుకూలమైన తీర్పు వచ్చే వరకూ కొనసాగించాలని లోకేష్ భావిస్తున్నారట.