ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం వేడెక్కింది. నేడు వెలువడిన పురపాలక ఎన్నికల ఫలితాలతో ఉత్సాహంలో ఉన్న అధికార పార్టీ వైసీపీ నేతలు యధావిధిగా మీడియా మాధ్యమాలలో కనిపిస్తూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పనైపోయిందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా అంతే స్థాయిలో వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా అయినా వైసీపీ గెలుపొందింది గానీ, దాదాపుగా వైసీపీతో సమానంగా తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఓట్లు వేసి తమ వ్యతిరేకతను చాటారని అభిప్రాయ పడుతున్నారు.

నారా లోకేష్ మరో అడుగు ముందుకు వేసి ఏకంగా ‘వైసీపీది శునకానందం’గా అభివర్ణించారు. అధికార దుర్వినియోగం – దొంగ ఓట్లు – గూండాగిరీతో గెలిచిన వైసీపీ శునకానందంలో ఉందని, అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేసి జగన్ బట్టలూడదీసి వాయగొట్టారనే విషయం బులుగు బుర్రలకు ఎప్పుడు ఎక్కుతుందో? అంటూ ట్వీట్ చేసి మరింత వేడి పుట్టించారు.