Nara Lokesh - Jaganకోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో పదవ తరగతి పరీక్షలు రద్దు చెయ్యాలని టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అయితే పరీక్షలు యధావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం పదే పదే చెబుతుంది. ఇటువంటి చర్యల వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్లు, అలా అనేక వర్గాల వారు కోవిడ్ రిస్క్ లో పడతారని లోకేష్ వారిస్తున్నారు.

“ఒక మూర్ఖుడికి ప్యాంటు, షర్టు వేస్తే జగన్ రెడ్డి… అందుకే మేము మూర్ఖపు రెడ్డి అని పేరు పెట్టడం జరిగింది. ఈ పరిస్థితులలో నా కొడుకు దేవాన్ష్ పదవ తరగతి పరీక్షలు రాయాల్సి వస్తే పంపను అందుకే దీనిని సీరియస్ గా తీసుకుని ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నా. అయితే లోకేష్ అడిగాడు కాబట్టి మేము పట్టించుకోము, పిల్లల ప్రాణాలు మాకు లెక్క లేదు అన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోంది,” అని లోకేష్ విమర్శించారు.

పరీక్షల నిర్వహణపై వాట్సాప్‌ ద్వారా అభిప్రాయాలు సేకరించినట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో 80 శాతం మంది పరీక్షలు నిర్వహించవద్దన్నారని చెప్పారు. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ నిర్ణయం మారకుంటే కోర్టుకెళ్తామని లోకేష్‌ పేర్కొన్నారు. మరోవైపు…. ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ పరిస్థితిని హేండిల్ చెయ్యడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని లోకేష్ ఆరోపించారు.

కరోనా మరణాలను ప్రభుత్వం తక్కువగా చూపిస్తోందని….టెస్ట్, ట్రేస్, ట్రీట్ విధానం అమల్లో ప్రభుత్వం విఫలమైదందని మండిపడ్డారు. ఆస్పత్రుల్లో పడకలు, మందులు కూడా దొరకని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ ఆస్పత్రిలోనూ ఆరోగ్యశ్రీ కింద కరోనా చికిత్స అందట్లేదని తెలిపారు.