Nara Lokesh - Pawan Kalyanమానవ బాంబుగా మారి ముఖ్యమంత్రిని చంపుతానని రాజమహేంద్రవరానికి చెందిన రాజుపాలెం పవన్ ఫణి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈనెల 16వ తేదీన ట్విటర్లో పోస్టు పెట్టిన పవన్ ఫణి ఆ తర్వాత వెంటనే ఆ పోస్ట్ ను డిలీట్ చేశారు. ఆపై అకౌంట్ ను కూడా క్లోజ్ చేశారు. తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు.

అయితే ఏపీ సిఐడి అతని మీద కేసు పెట్టి అరెస్ట్ చేసింది. తాను పవన్ కళ్యాణ్ వీరాభిమానిని అని పవన్ ఫణి సిఐడికి చెప్పినట్టు తెలుస్తుంది. ఈ విషయం పై జనసేన పార్టీ స్పందించింది. ముఖ్యమంత్రిని చంపుతానని సామాజిక మాధ్యమాలలో పోస్ట్ పెట్టిన వ్యక్తి తో జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది.

హింస, అశాంతి రేకెత్తించే వ్యాఖ్యలను తమ పార్టీ ఖండిస్తుందని వెల్లడించింది. అయితే ఈ విషయంగా జనసేన అంత ఆత్రంగా స్పందించాల్సిన అవసరం ఏముందని అభిమానులే ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇటువంటి లూస్ మాటలు మాట్లాడే యువకులు ఎక్కువే. నిజ జీవితంలో వారికి అంత సీన్ లేకపోయినా అనవసరమైన వ్యాఖ్యలతో హీరోయిజం ప్రదర్శిస్తుంటారు.

ఇలాంటి ప్రభుత్వం, పోలీసులు సీరియస్ గా తీసుకున్నప్పుడు ఇలా ఇబ్బందుల్లో పడతారు. లీగల్ గా చేసింది తప్పే కాబట్టి అరెస్టులు, కోర్టు కేసులు తప్పవు. అయితే ఏదో నిజంగా అతను ఉగ్రవాది, తమ పేరు చెబితే జనసేన పార్టీకి ఇబ్బందులు వస్తాయి అన్నట్టు ఉన్నఫళంగా ఇటువంటి ప్రకటన ఎందుకు?

పవన్ కళ్యాణ్ జగన్ ని చంపడానికి మానవ బాంబుని తయారు చేస్తున్నాడని ఎవరూ అనుకోరు కదా? ఇలా చెయ్యడం వల్ల కార్యకర్తల స్థైర్యం దెబ్బ తినడం వల్ల ఉపయోగం ఏముంటుంది?

జడ్జిలను దూషించిన కేసులు ఎదురుకుంటున్న తమ సోషల్ మీడియా అభిమానులకు లీగల్ హెల్ప్ చేస్తామని విజయసాయి రెడ్డి బాహాటంగానే ప్రకటించారు. మరోపక్క టీడీపీ అభిమానులు ఎవరైనా సోషల్ మీడియా పోస్టుల వల్ల ఇబ్బంది పడితే వెంటనే లాయర్లను పెట్టడం బెయిల్ ఇప్పించడం చేస్తున్నాడు నారా లోకేష్.

కార్యకర్తలను కాపాడుకునే విధానం అది. ఏదైనా సీరియస్ విషయం అయితే సరే.. లేదా సదరు వ్యక్తికి నేర చరిత్ర ఉన్నా ఓకే… ఏదో ఆకతాయితనం తో చేసిన పనికి జనసేన పార్టీ ఇలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా?

ఆ విషయంలో ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కంటే లోకేషే బెటర్ కదా? అని సొంత అభిమానులే అనుకోవడం విశేషం.