nara lokesh about ap government liquor isuueఏపీ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లుపై రచ్చ షురూ అయ్యింది. యదామాదిరే అసెంబ్లీ లోపల అధికార వైసీపీ పార్టీ., అసెంబ్లీ బయట ప్రతిపక్ష టీడీపీ పార్టీ ఒకరి మీద ఒకరి విమర్శల దాడి కొనసాగించారు. అధికార పార్టీ తీరుని తప్పు పట్టిన లోకేష్ తన విమర్శల దాడిలో రాటు తేలినట్లే స్పందించారు. గడచిన వారం రోజులుగా ‘సారా మరణాల’ మీద పట్టుపట్టి కూర్చుంది టిడిపి పార్టీ.

“అభివృద్ధి మా జెండా., సంక్షేమం మా ఏజెండా” అంటూ మొదలు పెట్టిన లోకేష్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల లిస్ట్ చదువుతూ అధికార పార్టీ వైఖరిని ఎండగట్టారు. అనంతపురంకు కియా మోటర్స్., చిత్తూరుకి సెల్ ఫోన్ తయారీ కంపెనీ., కర్నూల్ కి సిమెంట్ ఫ్యాక్టరీలు., ఈస్ట్ -వెస్ట్ గోదావరిలో పెద్ద ఎత్తున ఫిషరీస్., విశాఖలో అదాని కంపెనీ., గన్నవరం కు హెచ్.సి.ఎల్., మంగళగిరిలో ఎయిమ్స్., వీట్ వంటి యూనివర్సిటీలు.., ఇవి చంద్రబాబు హయాంలో వచ్చిన నవరత్నాలు అంటూ వైసీపీ పార్టీని నిలదీశారు.

ప్రభుత్వంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా మీరు రాష్ట్రానికి ఒక్క కంపనీనైనా తీసుకురాగలిగారా? మీరు చెప్తున్నట్లు ఈ కల్తీ మద్యం బ్రాండ్స్ అన్ని చంద్రబాబు హయాంలోనే మంజూరయితే వెంటనే రాష్ట్రం నుండి ఈ బ్రాండ్స్ ని నిషేదించే దమ్ముందా? జగన్ మోసపు రెడ్డి నీకు అంటూ లోకేష్ నేరుగా టార్గెట్చే చేసారు.

టీడీపీ పార్టీ నవరత్నాలన్నీ… ‘రాష్ట్ర అభివృద్ధి’ దోహద పడితే జగన్ నవరత్నాలు… ‘రాష్ట్ర వినాశనానికి’ కారణమవుతున్నాయన్నారు. అంతటితో ఆగకా జగన్ నవరత్నాలు ఇవే అంటూ.., స్పెషల్ స్టేటస్., బూమ్ బూమ్ బీర్., పవర్ స్టార్999., రష్యన్ రోమానోవ్., గవర్నర్ ఛాయిస్., స్పెషల్ స్టేటస్., త్రీ క్యాపిటల్స్ ., భారతి గోల్డ్., సాక్షి స్టేటస్ పేర్లతో సహా చెప్పి మరి ఒక రకంగా లోకేష్, జగన్&కో గ్యాంగ్ మొత్తాన్ని టీజింగో… ర్యాగింగో కూడా అర్ధం కాకుండా ఆడుకున్నారని టీడీపీ నేతలు తమ నాయకుడిపై ప్రశంసలు కురిపించారు.