Nannu-Dochukunduvate-Release-Date---Sudheer-Babuప్రిన్స్ మహేష్ బాబు బావ సుధీర్ బాబు ప్రస్తుతం “సమ్మోహనం” ఇచ్చిన హిట్ తో ఫుల్ ఖుషీలో ఉన్నాడు. ఇదే ఊపులో తాను నిర్మిస్తోన్న “నన్ను దోచుకుందువటే” సినిమా రిలీజ్ డేట్ ను మహేష్ స్టైల్లో ప్రకటించాడు. వినాయకచవితి పండగ స్పెషల్ గా సెప్టెంబర్ 13వ తేదీన సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలిపాడు సుధీర్.

అలాగే పండగ రోజైన సెప్టెంబర్12వ తేదీన ప్రీమియర్స్ తో పండగను ఘనంగా జరుపుకుందాం అంటూ ప్రిన్స్ ను ఫాలో అయ్యాడు. పండగల టైంలో తన సినిమాలు రిలీజ్ అవుతుంటే… ‘ఈ సారి పండగను ఘనంగా జరుపుకుందాం’ అంటూ ప్రకటించడం ప్రిన్స్ కు పరిపాటి. సరిగ్గా దానినే ఫాలో అవుతూ ప్రిన్స్ అభిమానగణాన్ని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేసాడు సుధీర్.