ntr nannaku prematho trnding in social mediaసుకుమార్ దర్శకత్వ కళా ప్రతిభ అందరికీ తెలిసేది కాదు. ఒక సాధారణ షాట్ ను కూడా సుకుమార్ డిఫరెంట్ గా మలుస్తారన్నది కేవలం డైరెక్టర్లకు మాత్రమే తెలిసే అంశం. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి గతంలో చెప్పిన ఓ విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. “1 నేనొక్కడినే” సినిమా విడుదలైన సమయంలో సుకుమార్ తో కలిసి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన రాజమౌళి… “1” సినిమా ఫస్ట్ టీజర్ లో పోలీసు స్టేషన్ ముందు మహేష్ బాటిల్ తో నిల్చుని ఉన్న షాట్ గొప్పతనం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. బహుశా తానైనా గానీ ఇంత అద్భుతంగా ఈ షాట్ ను తీసి ఉండే వాడిని కాదని, ఇలాంటి ‘టేకింగ్’లు మీ సినిమాలో చాలా ఉన్నాయని సుకుమార్ ని అభినందనలతో ముంచెత్తారు.

ఒక్క రాజమౌళి మాట మాత్రమే కాదు, డైరెక్షన్ డిపార్టుమెంటు గురించి అవగాహన వున్న ప్రతి ఒక్కరిది ఇదే రకమైన అభిప్రాయం. ఇక, తాజాగా సుకుమార్ దర్శకత్వం వహించిన “నాన్నకు ప్రేమతో” ఆడియో నేడు అంగరంగ వైభవంగా విడుదల కానుంది. దీనిని పురస్కరించుకుని జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన కొన్ని సినిమా పోస్టర్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఎన్టీఆర్ డ్యాన్సింగ్ చేస్తూ దర్శనమిస్తున్న ఈ పోస్టర్స్ ను ‘బుడ్డోడు’ అభిమానులు షేర్ చేసుకుంటూ పండగ చేసుకుంటున్నారు. ఒక్క ఎన్టీఆర్ అభిమానులనే కాదు, సినీ ప్రియులను కూడా ఈ “నాన్నకు ప్రేమతో” పోస్టర్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

దీంతో “నాన్నకు ప్రేమతో” ఆడియో అనేది సోషల్, వెబ్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ పోస్టర్స్ ఇంతలా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రధాన కారణం… సుకుమార్ ‘టేకింగ్.’ ఓ సాధారణ డ్యాన్సింగ్ స్టిల్ ను కూడా సుకుమార్ యాంగిల్ లో చూస్తే అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం జరుగుతోంది కూడా అదే! ఇటీవల జీప్ పై కూర్చుని వున్న జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్ కు కూడా అద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఇంకా “నాన్నకు ప్రేమతో” సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే మరికొద్ది గంటలు వేచిచూడాలి. అప్ డేట్స్ కోసం వీక్షిస్తూనే ఉండండి మీ అభిమాన ‘మిర్చి9.కాం’ను…!