ntr-movieరోజులు గడుస్తున్న కొద్ది సినీ ప్రేక్షకుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. సంక్రాంతి బరిలో మూడు పెద్ద సినిమాలు ఉండడంతో ప్రస్తుతం అందరి చూపులు పండగ వైపుకే మళ్లుతున్నాయి. అయితే బరిలో ఉన్న మూడు పెద్ద సినిమాలలో “డిక్టేటర్” ప్రచారంలో ముందుండగా, “సోగ్గాడే చిన్నినాయనా” కూడా నెమ్మది నెమ్మదిగా ప్రచారం ప్రారంభిస్తోంది. అయితే అన్నింటి కంటే ముందు విడుదల కావాల్సిన “నాన్నకు ప్రేమతో” మాత్రం పబ్లిసిటీలో వెనుకంజ వేయడం పలు సందేహాలకు తావిస్తోంది.

ఇటీవల జరిగిన ఆడియో వేడుకపై సినిమా విడుదల తేదీని జనవరి 13గా చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే విడుదల మరో 10 రోజుల్లో ఉందనగా, ‘ఎక్స్ ప్రెస్ రాజా’ ఇస్తున్న పబ్లిసిటీ కూడా ఇవ్వకపోవడంతో… “నాన్నకు ప్రేమతో…” వెనక్కి జారిందని సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం.

ఇందులో ఎంతవరకు వాస్తవముందో గానీ, “నాన్నకు ప్రేమతో” వాయిదా గ్యారెంటీ అనే మాట ట్రేడ్ వర్గాల్లో కూడా బలంగా వినపడుతోంది. బాబాయ్ బాలయ్యతో పోటీకి దిగితే ప్రస్తుతం సందడి చేస్తున్న ‘విబేధాల’ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లేనని… అందుకే ‘బుడ్డోడు’ తప్పుకుంటున్నాడంటూ సినీ వర్గాల టాక్. మరి నిజానిజాలు బయటకు రావాలంటే మరికొద్ది వెయిట్ చేయాల్సిందే.