jr-ntr-new-look-nannaku-premathoఅవును… 2016 సంక్రాంతి కానుకగా సుకుమార్ – జూనియర్ ఎన్టీఆర్ ల “నాన్నకు ప్రేమతో” సినిమా చూడాలనుకున్న వారికి ఫిల్మ్ నగర్ వర్గాల నుండి చేదు వార్తే అందుతోంది. ఈ నెల 27వ తేదీన ఆడియో విడుదల, జనవరి 13వ తేదీన సినిమా విడుదల అని హల్చల్ చేసిన సమాచారం ఒడిదుడుకులు వచ్చాయని, ప్రస్తుతం ప్రచారంలో ఉన్న తేదీలు ఇంకాస్త వెనక్కి వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయని ట్రేడ్ వర్గాల్లో బలంగా వినపడుతున్న సమాచారం.

ఇటీవల అర్ధరాత్రి జూనియర్ ఎన్టీఆర్ పెట్టిన ట్వీట్ మాదిరే “నాన్నకు ప్రేమతో” సినిమా విషయంలో ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి ఏర్పడిందని ఇండస్ట్రీ వర్గాల టాక్. నందమూరి బాలకృష్ణ నటించిన “డిక్టేటర్” సినిమా విడుదల ఉండడంతో, దానికి పోటీగా విడుదల అవుతుందనుకున్న “నాన్నకు ప్రేమతో” ఖచ్చితంగా వెనక్కి వెళ్తుందనే టాక్ సోషల్ మీడియా వ్యాప్తంగా ఊపందుకుంది. దీనికి కారణాలు మాత్రం అనేకం ప్రచారంలో ఉన్నాయి.

మరో నాలుగు రోజుల్లో ఆడియో విడుదల అని ప్రచారంలో ఉన్నా ఇప్పటివరకు నిర్మాణ సంస్థ స్పందించింది లేదు. దీంతో ‘వాయిదా’ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని అభిమానులు నమ్మే పరిస్థితి నెలకొంది. ప్రచారంలో వున్న విషయాల్లో స్పష్టత రావాలన్నా… ఈ సందిగ్ధత తొలగిపోవాలన్నా చిత్ర యూనిట్ స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది.