ntr nannaku premathoక్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన “నాన్నకు ప్రేమతో” విడుదల తేదీపై పలు సందేహాలు నెలకొన్నాయి. రెండు రోజుల క్రితం చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ లో కూడా తేదీని ప్రకటించకుండా ‘సంక్రాంతి విడుదల’ అని మాత్రమే వేయడంతో, గతంలో తెలిపిన జనవరి 13వ తేదీన చిత్రం విడుదల కాదు అన్న వార్తలకు బలం చేకూరినట్లయ్యింది.

అయితే సోషల్ మీడియాలో సందడి చేస్తున్న సమాచారం మేరకు ‘నాన్నకు ప్రేమతో’ విడుదల తేదీ 13వ తేదీగానే ఖరారవుతోంది. దీనికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఇది స్థానికంగా కాదు, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో! ఎల్8 ఎంటర్ టైన్మెంట్ సంస్థ జనవరి 13 నుండి 16 వరకు సాయంత్రం 8.15 నిముషాలకు ప్రారంభం కాబోయే షో కోసం అడ్వాన్స్ టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. దీంతో “నాన్నకు ప్రేమతో” ముందుగా అనుకున్న సమయానికే విడుదల అవుతోంది అంటూ సోషల్ మీడియాలో అభిమానులు సందడి చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఈ సినిమా హీరోహీరోయిన్లు డబ్బింగ్ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ఈ సినిమాలోని సన్నివేశాలకు డబ్బింగ్ చెబుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నానని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేసింది. ఈ సినిమాపై ఏర్పడిన అంచనాల రీత్యా, సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే, బాక్సాఫీస్ బద్ధలైనట్లేనని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

nannaku-prematho-advance-booking-startednannaku-prematho-advance-booking-started