nannaku-preamato-poster-controversyపబ్లిసిటీకి ‘వివాదం’ కేరాఫ్ అడ్రస్. ఇటీవల కాలంలో ఫ్రీ పబ్లిసిటీకి చిరునామాగా మారింది ‘వివాదం.’ అలంటి వివాదం జూనియర్ ఎన్టీఆర్ “నాన్నకు ప్రేమతో” సినిమాను తాకింది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం పోస్టర్లపై హైదరాబాదులో ముస్లిం యువకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ మనోభావాలను దెబ్బతీసేలా ఇవి ఉన్నాయని, ఈ పోస్టర్లను తక్షణం తొలగించాలని, ఆ సన్నివేశాలను ఆ చిత్రం నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.

రోడామిస్త్రీ కాలనీ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ కాలనీలో ముస్లిం యువత ఈ రోజు బైక్ ర్యాలీ నిర్వహించారు. జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మాసబ్ ట్యాంకులోని సెన్సార్ బోర్డ్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. మరి ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో గానీ, ‘నాన్నకు ప్రేమతో’ సినిమా కోసం ఈ నెల 13వ తేదీ వైపు అభిమానులు ఎదురు చూస్తున్నారు.