nanna-nenu-naa-boyfriends-motion-poster‘కుమారి 21ఎఫ్’ ద్వారా యువత గుండెల్లో చెరగని ముద్ర వేసిన హేబా పటేల్ నటిస్తున్న మరో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ “నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్” సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. సినిమా కంటెంట్ ను ఫస్ట్ లుక్ లోనే చెప్పేయలనుకున్నారో ఏమో గానీ, విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పిక్చర్ వీక్షకులలో పాజిటివ్ వైబ్రేషన్స్ ను కలిగించడంలో సక్సెస్ సాధించింది.

బైక్ తోలుతున్న హేబా పటేల్ కు ఒక వైపు నాన్న, మరో వైపు ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ తో కూడిన మోషన్ పిక్చర్ వినోదాన్ని పంచుతోంది. నాన్న పాత్రలో రావు రమేశ్ నటించగా, ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ గా అశ్విన్, పార్వతీశం, నోయెల్ లు కనపడనున్నారు. బండి భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను లక్కీ మీడియా పతాకంపై వేణుగోపాల్ నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమా ‘కంటెంట్’ నచ్చిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు, “నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్”ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై విడుదల చేస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో విడుదల కావడంతో, ఈ చిన్న సినిమాకు ధియేటర్ల కొరత పెద్దగా తలెత్తకపోవచ్చు. అలాగే పబ్లిసిటీ విషయంలో తగిన ప్రాధాన్యత లభిస్తుందని చెప్పడంలో సందేహం లేదు.