Nani’s-Gang-Leader-Is--A-Disasterనేచ్యురల్ స్టార్ నాని ల్యాండ్ మార్క్ 25వ సినిమా ‘వీ’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా ఉన్నారు. నాని నెగటివ్ రోల్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను ఉగాది కానుకగా 2020 మార్చ్ 25న ఉగాది సందర్భంగా రిలీజ్ చెయ్యబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఒక పోస్టర్ విడుదల చేశారు.

పోస్టర్ లో ఒక వ్యక్తి రెండు చేతులలో రెండు గన్లతో షూట్ చేస్తున్నాడు. దీనితో వీ అంటే వయోలెన్సా అనే అనుమానాలు వస్తున్నాయి. దిల్ రాజు ప్రొడక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ప్రస్తుతం సగం షూటింగ్ ని పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ వీలైనంత త్వరగా మిగతా వర్క్ ని కూడా ఫినిష్ చేసే పనిలో ఉన్నారు.

నాని ఎక్కువగా యాక్షన్‌ సీన్స్‌ ఉండే సినిమాలు చేయడని.. కొందరు ఆయనపై విమర్శలు కూడా చేస్తుంటారు. అలాంటి వారి కోసమే నాని చేసిన ఓ ట్వీట్‌ ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటుంది. వయోలెన్స్‌ కావాలన్నారుగా, ఇస్తా ఉగాదికి సాలిడ్‌గా ఇస్తా అని నాని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం వీ షూటింగ్ నార్త్ ఇండియా లో జరుగుతుంది.

నివేత థామస్ – అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందించనున్నాడు. ఈ సంగీత దర్శకుడు ఇంతకుముందు సైరా సినిమాకు మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. నానిని అష్టాచెమ్మా తో హీరోని చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.