Here's-Why-Nani's-V-Release-Is---Adding-Even-More-Curiosityకరోనా వైరస్ ప్రభావం సినిమా ఇండస్ట్రీపై భారీగా ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాలలో సినిమా థియేటర్లు మూసుకుపోయాయి. దీనితో అనేక సినిమాల రిలీజ్ వాయిదా పడనున్నాయి. ఈ నేపథ్యంలో నాని, సుధీర్ బాబు నటించిన వీ సినిమా వాయిదా వేస్తున్నామని ఆ చిత్ర బృందం ప్రకటించింది.

తమ ఆధీనంలోలేని పరిస్థితుల కారణంగా మార్చి 25న రావాల్సిన సినిమాను వాయిదా వేస్తున్నామని నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ తాజాగా ప్రకటించింది. ఇప్పుడు ఈ సినిమా ఏప్రిల్ లో రాబోతుంది. సమ్మర్ హాలిడేస్ ఎడ్వాంటేజ్ పై ఎన్నో ఆశలు పెట్టుకుని చాలా సినిమాలు ఏప్రిల్, మే నెలలో రావడానికి సన్నాహాలు చేస్తున్నాయి.

కరోనా ప్రభావం ఈ నెలాఖరుకు తగ్గకపోతే మరిన్ని సినిమాలు తమ రిలీజ్ డేట్లు మార్చుకోవాల్సి ఉంటుంది. ఇది ఇలా ఉండగా… ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 83కు చేరింది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి ఇద్దరు ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ రూ.4లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

ప్రాణాంతకమైన ఈ వైరస్ ను విపత్తుగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైరస్ వల్ల మరణించిన వారి కుటుంబాలను రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి(ఎస్ డీఆర్ ఎఫ్ ) ద్వారా ఆర్థికంగా ఆదుకోనున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో పాటు ఆసుపత్రుల్లో అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వం భరించనుంది.