Film-and-TV-Industries-To-Temporarily-Shift-to-Chennaiనేచురల్ స్టార్ నాని మరియు సుధీర్ బాబు యొక్క వీ డిజిటల్ హక్కులను అమ్మడానికి దిల్ రాజు అమెజాన్ ప్రైమ్ వీడియోతో చర్చలు జరుపుతున్నట్లు పుకార్లు వచ్చాయి. థియేటర్ విడుదలని దాటవేస్తూ ఈ చిత్రం నేరుగా ఆన్‌లైన్‌లో విడుదల కావడం కోసం చర్చలు జరిగాయి. సుధీర్ బాబు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నప్పటికీ ఈ చిత్రం థియేటర్లలో మాత్రమే విడుదలవుతుందని అన్నారు.

“చర్చలు జరిగాయన్నది నిజం. కాని ఇది థియేటర్లలో చూడవలసిన చిత్రం అని మేము ఒక నిర్ణయానికి వచ్చాము. ఆ ప్రతిపాదనను విరమించుకున్నాము. ఒక దశలో సినిమా మొదటి సగం ఓటీటీ లో విడుదల చేయడాన్ని కూడా మేము పరిగణించాము. సినిమాలో ఒక ట్విస్ట్ ఉంది… అది కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే విధంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం థియేటర్లలో మాత్రమే విడుదల అవుతుంది “అని ఆయన ఒక ఇంటర్వ్యూలో అన్నారు.

2017లో విడుదలైన ఎంసీఏ సినిమా తరువాత నానికి సరైన హిట్ లేదు. ఆ తరువాత ఆయన నుండి నాలుగు సినిమాలు వచ్చాయి. అయితే ఆ నాలుగు సినిమాలు నిరాశపరిచాయి. దీనితో ఈ చిత్రం పై నాని భారీ ఆశలే పెట్టుకున్నారు. కెరీర్ లో పెద్ద బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న సుధీర్ బాబు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.

నాని మొదటి సినిమా డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నివేత థామస్ – అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందించారు. నాని క్యారెక్టర్ ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉండబోతున్నాయని సమాచారం. యాక్షన్ పార్టు కూడానా ఎక్కువగా ఉంటుందంట.