Shyam Singha Roy Release dateనేచురల్ స్టార్ నాని, టాక్సీ వాలా చిత్ర దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం `శ్యామ్ సింగా రాయ్`. పనిలో పనిగా డిసెంబర్ 25న సినిమాను విడుదల చేస్తామని రిలీజ్‌ డేట్‌ను కూడా ప్రకటించేసింది. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ సినిమాలో నాని బెంగాళీ బాబుగా కనిపించనున్నాడట.

ఇక ఈ సినిమాలో హీరోది డబుల్‌ రోల్‌ అని కొందరు, లేదు.. ట్రిపుల్‌ రోల్‌ అని మరికొందరు సోషల్‌ మీడియాలో మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే తెలియజేస్తామని సినిమా యూనిట్‌ తెలిపింది. ఇది అలా ఉండగా.. ఈ చిత్రం మ్యూజిక్ కోసం ఏఆర్ రెహమాన్ తో సంప్రదింపులు జరుపుతున్నారు.

ఏఆర్ రెహమాన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసి చాలా కాలం అయ్యింది. పైగా రెహమాన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తే అది ప్లాప్ అవుతుంది అనే సెంటిమెంట్ కూడా ఉంది. అయితే ఈ సెంటిమెంట్ కి నాని భయపడటం లేనట్టుగానే ఉంది. ఈ చిత్రానికి సమర్పణ పి.డి.వి.ప్రసాద్.

ప్రస్తుతం నాని నటించిన ‘వి’ చిత్రం మార్చి 25న విడుదల కానుంది. నాని ప్రస్తుతం టక్ జగదీష్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ చిత్రం జులైలో పూర్తి అవుతుంది. ఆ సినిమా షూటింగ్ పూర్తి అయ్యాకా శ్యామ్ సింగా రాయ్ షూటింగ్ మొదలు పెడతాడు. మొత్తానికి నాని వచ్చే ఏడాది ఏడాదిన్నర వరకూ ఫుల్ బిజీగా ఉండదు.