Krishnarjuna-Yudham-Gives-Nani-A-Taste-Of-Majnuవరుసగా 8 హిట్లు అందుకుని, తొమ్మిదవ హిట్ (ట్రిపుల్ హ్యాట్రిక్) అందుకుంటాడని భావించిన తరుణంలో “కృష్ణార్జున యుద్ధం” పరాజయం పాలయ్యింది. నాని డ్యూయల్ రోల్స్ లో చేసిన ఈ సినిమా ఇటీవలే విడుదలై, ప్రేక్షకుల నుండి తిరస్కరింపబడగా, తాజాగా యుప్ టీవీలో వెబ్ అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ… ‘నాని లేటెస్ట్ సూపర్ హిట్ ఫ్లిక్ కృష్ణార్జున యుద్ధం యుప్ టీవీ మినీ ధియేటర్ లో చూడండి’ అంటూ పోస్ట్ చేయగా,దానికి నాని రిప్లై ఇచ్చాడు.

‘సూపర్ హిట్ అంట… అవ్వలేదు బాబాయ్… ఆడలేదు కూడా… అయినా మనసు పెట్టి చేసాం… చూసేయండి…’ అంటూ సినిమాపై అసలు టాక్ ను ఒప్పేసుకున్నాడు. నాని గొప్పగా ఏం చెప్పలేదు గానీ, ఆ సినిమా ఆడలేదన్న విషయాన్ని పబ్లిక్ గా ఒప్పేసుకున్నాడు. దీంతో నాచురల్ స్టార్ ఫ్రాంక్ నెస్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాలం మారింది… హీరోలు కూడా మారుతున్నారు… అని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా నిలుస్తుందని చెప్పవచ్చు. బహుశా మున్ముందు ఇలా పబ్లిసిటీ చేసే సమయంలో సదరు డిజిటల్ మీడియాలు కూడా జాగ్రత్త వహిస్తాయేమో!