Nani - Nagarjuna Akkineniవరుస సినిమాలతో… వరుస విజయాలతో నాచురల్ స్టార్ నాని దూసుకుపోతున్న అంశం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రీసెంట్ గా వచ్చిన ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా పరాజయం పాలైనా, నాని క్రేజ్ కేం డోఖా లేదు. అలాగే పారితోషికంలోను పెద్దగా మార్పులు జరగలేదు. ప్రస్తుతం ఆయన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఒక మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నాడు. నాగార్జున .. నాని ప్రధానమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమా షూటింగు దశలో వుంది.

ఈ సినిమా కోసం నాగార్జునకు దాదాపుగా 4 కోట్ల రెమ్యునరేషన్ ముడుతుందని ప్రచారం జరుగుతుండగా, నానికి అంతకి మించి లభించనుందనే టాక్ ట్రేడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఇంతకు ముందు సినిమాలకి తీసుకున్నట్టుగానే ఆయన ఈ సినిమాకీ తీసుకున్నాడు. కథలో నాని పాత్ర స్క్రీన్ పై ఎక్కువగా కనిపిస్తుందనీ, ఆయన పోర్షన్ ఎక్కువగా ఉండటం వల్లనే నాని అంతమొత్తం తీసుకున్నాడని అంటున్నారు. ఇక ‘బిగ్ బాస్ 2’ రూపంలోనూ అదృష్టం నాని తలుపు తట్టిందని చెప్పుకుంటున్నారు.