Pic Talk: Nani Comes As The Devil Comes To Throw Challengeనేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో రూపోందుతున్న చిత్రం ‘వి’. అదితిరావు హైదరి, నివేదా థామస్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ‘అష్టా చమ్మా’, ‘నాని జెంటిల్‌మన్‌’ వంటి హిట్‌ చిత్రాలను నానికి అందించిన ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నిన్న సినిమాలోని సుధీర్ బాబు లుక్ ని విడుదల చేసిన టీం ఈరోజు నాని లుక్ ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.

ఈ సినిమాలో నాని నెగటీవ్‌ షేడ్స్‌లో కనిపించనున్నాడు. ఈ పోస్టర్ లో నాని గడ్డంతో రఫ్ లుక్ లో కనిపిస్తూ… చేతిలో కత్తెర, చేయి మీద నుండి కారుతున్న రక్తంతో అదిరింది. ఈ లుక్‌తో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

దిల్ రాజు ప్రొడక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందించనున్నాడు. ఈ సంగీత దర్శకుడు ఇంతకుముందు సైరా సినిమాకు మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. న‌రేశ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పవిత్ర లోకేష్ , నందు, కేదార్ శంక‌ర్‌, కాదంబ‌రి కిర‌ణ్‌, హ‌రితేజ‌, రాహుల్ రామ‌కృష్ణ‌ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.

2017లో విడుదలైన ఎంసీఏ సినిమా తరువాత నానికి సరైన హిట్ లేదు. ఆ తరువాత ఆయన నుండి నాలుగు సినిమాలు వచ్చాయి. అయితే ఆ నాలుగు సినిమాలు నిరాశపరిచాయి. దీనితో ఈ చిత్రం పై నాని భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావడంతో నాని తన తరువాతి చిత్రం ‘టక్ జగదీష్’ షూటింగ్ మొదలు పెట్టబోతున్నాడు.