Nani Mohankrishna indraganti Movie wrapsన్యాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు కలిసి నటిస్తున్న సినిమా ‘వీ’. నాని మొదటి సినిమా డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈరోజుతో పూర్తి కానుందని నాని కాసేపటి క్రితం ట్విట్టర్ లో ప్రకటించాడు. ఈ సినిమాను ఉగాది కానుకగా 2020 మార్చ్ 25న ఉగాది సందర్భంగా రిలీజ్ చెయ్యబోతున్నట్టు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది.

అంటే రెండున్నర నెలల ముందే సినిమా షూటింగ్ పూర్తి అవుతుంది. ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు చాలా వరకూ పూర్తి ఐపోయాయట. దిల్ రాజు ప్రొడక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. నివేత థామస్ – అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందించనున్నాడు.

ఈ సంగీత దర్శకుడు ఇంతకుముందు సైరా సినిమాకు మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. న‌రేశ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పవిత్ర లోకేష్ , నందు, కేదార్ శంక‌ర్‌, కాదంబ‌రి కిర‌ణ్‌, హ‌రితేజ‌, రాహుల్ రామ‌కృష్ణ‌ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. నాని క్యారెక్టర్ ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉండబోతున్నాయని సమాచారం. యాక్షన్ పార్టు కూడానా ఎక్కువగా ఉంటుందంట.

2017లో విడుదలైన ఎంసీఏ సినిమా తరువాత నానికి సరైన హిట్ లేదు. ఆ తరువాత ఆయన నుండి నాలుగు సినిమాలు వచ్చాయి. అయితే ఆ నాలుగు సినిమాలు నిరాశపరిచాయి. దీనితో ఈ చిత్రం పై నాని భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావడంతో నాని తన తరువాతి చిత్రం ‘టక్ జగదీష్’ షూటింగ్ మొదలు పెట్టబోతున్నాడు.