Majnu Teaser Talk, Nani Majnu Teaser Talk, Majnu Movie Teaser Talk, Nani Majnu Movie Teaser Talk, Hero Nani Majnu Teaser Talkసక్సెస్ లో ఉన్నపుడు ఎలాంటి సినిమాలు చేసినా ప్రేక్షకులకు ఒక రకమైన పాజిటివ్ మూడ్ ఉంటుంది. ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని కూడా ఇలాంటి అనుభూతులనే ఆడియన్స్ కు పంచుతున్నాడు. ‘భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీరప్రేమగాధ, జెంటిల్మెన్’ సినిమాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న నాని, త్వరలోనే ‘మజ్ను’ సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.

ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపించగా, తాజాగా విడుదలైన టీజర్ ‘మజ్ను’ పట్ల పాజిటివ్ సంకేతాలను కలిగించింది. విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ లో నాని, మోడ్రన్ మజ్నుగా రైలులో పాట వింటూ శాలువ కప్పుకున్నాడు. ‘షార్ట్ అండ్ సింపుల్’గా ఉన్న టీజర్ లో గోపి సుందర్ సంగీతం ఆకట్టుకోగా, హీరోయిన్ లుక్ పట్ల మాత్రం వీక్షకులు అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు.

ఎండింగ్ లో ‘స్టార్ట్ లవింగ్’ అంటూ ఈ సెప్టెంబర్ లో విడుదల కాబోతుందని స్పష్టం చేయడంతో ‘నాచురల్ స్టార్’ అభిమానులు వచ్చే నెలలో ‘మజ్ను’ కోసం నిరీక్షిస్తున్నారు. ఈ సినిమా విజయంతో నాని ‘డబుల్ హ్యాట్రిక్’కు శ్రీకారం చుట్టడం ఖాయమని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఈ టీజర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.