Jersey Movie Poster Talkటాలీవుడ్ యువ హీరో నాని అనగానే ‘మన పక్కింటిలో ఉండే కుర్రాడులా ఉంటాడు’ అని ప్రేక్షకులు అనుకుంటారు. అందుకే ‘నాచురల్ స్టార్’ అన్న బిరుదుకు సరిగ్గా సూట్ అయ్యాడు. కానీ నాని లేటెస్ట్ మూవీ పోస్టర్ మాత్రం ఆ ఫీల్ ను దూరం చేసిందనే టాక్ వచ్చింది. గౌతమ్ తిన్ననురి దర్శకత్వంలో నాని నటిస్తోన్న సినిమాకు “జెర్సీ” అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.

టీమిండియా తరపున ఆడే క్రికెటర్లు ధరించే జెర్సీని చూపిస్తూ బ్యాట్, హెల్మెట్, గ్లౌజ్ లు తదితర క్రికెట్ కిట్ లను పెట్టి రిలీజ్ చేసిన ఈ పోస్టర్ తెలుగు ప్రేక్షకులను ఏ మాత్రం ఆకర్షించలేదని చెప్పాలి. బాలీవుడ్ లో బయోపిక్ పోస్టర్ల మాదిరి ఉన్న “జెర్సీ” తెలుగు ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో గానీ, ఫస్ట్ లుక్ లో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో ఈ సారి నాని విఫలమయ్యాడు.