Krishnarjuna Yudhamకృష్ణుడు అంటే గుర్తుకు వచ్చేది ఎంటర్టైన్మెంట్…. అర్జునుడు అంటే గుర్తుకు వచ్చేది పద్మవ్యూహాలు… కానీ నాని ఈ రెండింటిని రివర్స్ చేయబోతున్నాడు. తన తాజా చిత్రం “కృష్ణార్జున యుద్ధం” సినిమాలో ముందుగా కృష్ణుడు క్యారెక్టర్ ను సీరియస్ గా విడుదల చేసిన నాని, నేడు ‘అర్జున’ క్యారెక్టర్ ను ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ప్రజెంట్ చేసాడు. లుక్స్ పరంగా రెండింటికి వేరియేషన్స్ ఏమీ లేవు గానీ, కాస్ట్యూమ్స్ పరంగా అయితే చూపించారు.

కృష్ణుడు క్యారెక్టర్ ను పల్లెటూరు సీరియస్ లుక్ లో చూపించగా, అర్జునుడు క్యారెక్టర్ ను టౌన్ వతవారానికి అనుగుణంగా లేటెస్ట్ యువకుడు లుక్ లో చూపించారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్స్ లో నటించగా, ఈ రెండు క్యారెక్టర్స్ ను ప్రేక్షకులకు పరిచయం చేసారు. ఇక కనుమ నాడు ఫస్ట్ సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఏప్రిల్ లో విడుదల చేయనున్న ఈ సినిమా ప్రమోషన్స్ ను నాలుగు నెలల ముందుగానే ప్రారంభించడం విశేషం.