Nani claps for HIT 2 telugu movie2020 బ్లాక్ బస్టర్ చిత్రం ‘హిట్’ రెండవ భాగం ఈరోజు ముహూర్తం జరుపుకుంది. మొదటి భాగంలో ప్రధాన పాత్ర పోషించిన విశ్వక్ సేన్ స్థానంలో హిట్ 2లో ఆడవి శేష్ నటించనున్నారు. శేష్ తన మేజర్ షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. మొదటి భాగం దర్శకత్వం వహించిన సైలేష్ కోలను ఈ సినిమా కోసం మెగాఫోన్‌ను పట్టుకోనున్నారు.

ప్రశాంతి తిపిరినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, నేచురల్ స్టార్ నాని మొదటి భాగం లాగానే దీనిని సమర్పించనున్నారు. ఈ చిత్రంలో ఆడవి శేష్ కృష్ణ దేవ్ ‘కేడీ’ గా కనిపించనున్నారు. ఈ చిత్రం కాస్టింగ్ విషయంలో నాని మంచి బిజినెస్ మైండ్ ఉపయోగించారు అనే చెప్పుకోవాలి. మొదటి పార్టీ సక్సెస్ ఫుల్ సబ్జెక్టు కాబట్టి రెండో భాగం రేంజ్ పెంచేలా అడివి శేష్ ని హీరోగా పెట్టుకున్నాడు.

జూన్ లో విడుదలయ్యే మేజర్ గనుక హిట్ అయితే… ఈ సినిమా పాన్-ఇండియా ప్రాజెక్ట్ గా మారి సూపర్ బిజినెస్ చేస్తుంది. ఈ రెండవ భాగం అటు ట్రేడ్ లోనే కాకుండా సాటిలైట్ మరియు డిజిటల్ హక్కుల కూడా మంచి డిమాండ్ ని కలిగి ఉంటుంది. ఏ రకంగా చూసినా నాని మాములు బిజినెస్ మైండ్ కాదు అనే అనుకోవాలి.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మేజర్ పూర్తయ్యాక మొదలు అవుతుంది. మణికందన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్‌ స్టీవర్ట్‌ ఎడురి సంగీతాన్ని అందించనున్నారు. మీనాక్షి చౌదరి ఫీమేల్‌ లీడ్‌ రోల్‌ చేస్తోంది. మరో పాత్రలో కొత్త హీరోయిన్ కోమలీ ప్రసాద్ కనిపించనుంది. ‘ది సెకండ్‌ కేస్‌’ అనేది సినిమా ట్యాగ్‌లైన్‌.