Nani asks director vikram to make changes in storyసినిమాల్లో కరియర్ స్టార్టింగ్ లో దర్శకుడిని నమ్మి సినిమాలు తీసే యువ హీరోలు కాస్త స్టార్ డమ్ వచ్చే సరికి..దాన్ని కాపాడుకోవడానికి వారిని ఆధారంగా చేసుకుని కధలు రాయమని చెబుతారు. అలా చాలా జరుగుతూ ఉంటాయి అని, కధ నచ్చక చాలా సినిమాలు వదిలేశామని చాలా హీరోలు చెబుతూనే ఉంటారు. అయితే అలా వదిలెయ్యకుండా న్యాచురల్ స్టార్ నాని దర్శకుడికి మరో అవకాశం ఇచ్చాడు. కధ బావుంది, కానీ రెండో భాగంలో కొన్ని మార్పులు చేసి, చెప్పండి అని పంపించాడట. కట్ చేస్తే దర్శకుడు విక్రమ్ ఇంకొంచెం టైమ్ తీసుకుని కధలో మార్పులు చేసి తీసుకుని మళ్లీ వచ్చాడట. అయితే ఆ మార్చిన లైన్ నానికి బాగా నచ్చడంతో నాని సినిమాని ఓకే అని చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇక ఇదే కధని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కూడా చెప్పిన దర్శకుడు విక్రమ్ అర్జున కూడా సెకెండ్ హాఫ్ విని నచ్చకపోవడంతో విక్రమ్ ను కాదు అన్న సంగతి మనం గతంలో చూశాం. ఇప్పుడు నాని మాత్రం రెండో భాగంలో చెయ్యమని చెప్పడంతో విక్రమ్ తుది మెరుగులు దిద్దాడట. మొత్తంగా చూసుకుంటే అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మాత్రం వచ్చే మార్చ్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.

మరి “మనం” సినిమా లాంటి మంచి ఫీల్ గుడ్ మూవీ అందించిన దర్శకుడు విక్రమ్ అదే రేంజ్ భారీ హిట్ కోసం గత కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. మధ్యలో సూర్య తో 24, చైతుతో హాల్లో తీసినా తన రేంజ్ హిట్ అనుకోకపోవడంతో, నానితో మరో మారు తన టాలెంట్ ను ప్రేక్షకులకు రుచి చూపించాలి అని ఆలోచిస్తున్నాడు విక్రమ్. మరి ఆయన ఆలోచన ఎలాంటి సినిమాను అందిస్తుందో చూద్దాం.