Andhra Pradesh Telugu Desam Partyనంద్యాల జిల్లా నందికొట్కూరు రూరల్ మండలంలోని శాతనకోట గ్రామంలో టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకుడు జయసూరి, మండలాల కన్వీనర్లు కలిసి ఆదివారం బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిడుతూరు మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి, ఎంపీటీసీ చిన్న సుబ్బయ్య, మాజీ సర్పంచ్ ఆలీమొయిద్దీన్, స్వాములు, టిడిపి నాయకులు పల్లె రఘునాథ్ రెడ్డి, కొణిదెల ఓబుల్ రెడ్డి, గుట్టపాడు రామసుబ్బారెడ్డి, బింగి రామకృష్ణ, చింతకుంట నారాయణ, జక్కుల లక్ష్మీనార్యాన, ఆళ్వాల రామకృష్ణారెడ్డి, మద్దెలేటి, భాస్కర్, మధు, మహ్మద్ ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలోనే పాములపాడు మండల అధ్యక్షుడు చెల్లే హరనాథ్ రెడ్డి నేతృత్వంలో టిడిపి నాయకులు తిమ్మారెడ్డి, రవీంద్ర రెడ్డి, మధుకృష్ణ గోవిందు, శంకర్ స్వామి, కరీంబాషా, షాహిన్ బాషా, లింగేష్ గౌడ్, అర్జున్ గౌడ్, పూసల కృష్ణ, శంకర్ గౌడ్, వెంకట కృష్ణారెడ్డి,రాము, ఈశ్వర్, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “వైసీపీ అధికారంలోకి వస్తే పరిశ్రమలు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. కానీ ఇప్పుడు ఉన్న పరిశ్రమలే మూసుకొని పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతుండటంతో ఏపీలో యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్‌, బెంగళూర్ వంటి పొరుగు నగరాలకు వెళ్ళవలసివస్తోంది. మన యువత పొరుగు రాష్ట్రాలకు వెళ్ళవలసి వస్తున్నందుకు వైసీపీ ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోవాలి. పరిశ్రమలు, పెట్టుబడులు సాహించి యువతకు ఉద్యోగాలు కల్పించకపోగా అన్నిటి ఛార్జీలు పెంచేసి సామాన్య ప్రజలపై సిఎం జగన్మోహన్ రెడ్డి చాలా భారం మోపుతుండటం చాలా బాధాకరం. పైగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైసీపీ నేతల అరాచకాలు, దౌర్జన్యాలు. జగన్ ఇష్టారాజ్యంగా పాలన చేస్తుండటంతో రాష్ట్రం అన్ని రంగాలలో భ్రష్టు పట్టిపోయింది. జగన్ పాలన చూసి ప్రజలు వేశారిపోయారు. ఎన్నికలలో గద్దె దింపడానికి ఎదురుచూస్తున్నాన్నారు.” అని అన్నారు