nara-lokesh-says-director-not-decided-ntr-biopicనంది అవార్డుల ఎంపిక పై వస్తున్న విమర్శలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. నంది అవార్డుల పరిణామాలపై సీఎం చంద్రబాబు చాలా బాధపడ్డారని, గతంలో నంది అవార్డులు ఇవ్వని వాళ్లను ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.

ఎన్‌ఆర్‌ఏలు హైదరాబాద్‌లో కూర్చుని ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని, ఏపీలో ఆధార్‌, ఓటర్‌ కార్డు లేనివారు కూడా ప్రత్యేక హోదా, నంది అవార్డులపై విమర్శలు చేస్తే ఎలా? అలంటి వారిని ప్రజలు హర్షిస్తారా అని లోకేష్‌ మండిపడ్డారు. ఇప్పుడు విమర్శించేవారు జ్యూరీలో కూడా ఉన్నారని, హైదరాబాద్‌లో కూర్చుని ఏపీలో ఏం చేయాలో చెబితే ప్రజలు హర్షించరని హెచ్చరించారు.

నంది అవార్డులపై ఇద్దరు, ముగ్గురు మాత్రమే మాట్లాతున్నారని లోకేష్‌ ఆరోపించారు. నంది అవార్డుల ఎంపిక పూర్తిగా జ్యూరీదే అయినా వాటికి రాజకీయ రంగు పూలమాలని చేసి ప్రయత్నంపై గవర్నమెంట్ సీరియస్ గా ఉందని సమాచారం. అదే కంటిన్యూ అయితే అవార్డుల రద్దుకూడా వెనుకాడబోము అని ముఖ్యమంత్రి అన్నట్టు సమాచారం.