nandamuri-taraka-ratna-pays-rs-50000-narasaraopet-rdo-officeఫ్యాన్సీ నెంబర్ల కోసం సెలబ్రిటీలు పడే తిప్పలు అన్ని ఇన్ని కావన్న సంగతి తెలిసిందే. అయితే ‘9999’ నెంబర్ల కోసం ఎంత మొత్తమైనా పర్లేదు అనుకునే వారు ఉండడంతో, రవాణా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈ నెంబర్ అత్యధిక ధర పలుకుతుందన్న విషయం తెలిసిందే. ఇటీవలే తన కొత్త కారుకు ఖైరతాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ‘9999’ నెంబర్ ను భారీ మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

తాజాగా ఇదే కుటుంబానికి చెందిన మరో హీరో నందమూరి తారకరత్న ‘9999’ ఫ్యాన్సీ నెంబర్ ను సొంతం చేసుకున్నారు. గుంటూరు జిల్లా, నరసరావుపేట ఆర్టీవో కార్యాలయం జరిగిన ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ వేలంలో 6 లక్షల రూపాయలు వెచ్చించి ఈ నెంబర్ ను సొంతం చేసుకున్నారు తారక్. సెలబ్రిటీలు ఒక నెంబర్ కోసం ఖర్చు పెట్టే మొత్తంతో ఏకంగా ఒక కారు వచ్చేస్తుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో! అయితే ‘9999’ నెంబర్ ఒక్కోసారి 10 లక్షలు కూడా దాటుతుందని గణాంకాలు చెప్తున్నాయి.