Nandamuri Ramakrishna into politicsనందమూరి కుమారుల నుండి ఇప్పటికే బాలకృష్ణ రాజకీయాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఈ మధ్యే రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా ఎన్టీఆర్ మరో కుమారుడు నందమూరి రామకృష్ణ కూడా రాజకీయాలలోకి వస్తారా అనే చర్చ జరుగుతుంది. సహజంగా లో ప్రొఫైల్ మైంటైన్ చేసే రామకృష్ణ ఈ మధ్య వివిధ కార్యక్రమాలలో తరచు కనిపిస్తున్నారు.

అమరావతిలో రైతులు చేస్తున్న ఆందోళనలో ఆయన చంద్రబాబుతో పాటు పాల్గొన్నారు. రైతుల గురించి మాట్లాడుతూ కన్నీరు కూడా పెట్టుకున్నారు. నేడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు 24వ వర్ధంతి. ఎన్టీఆర్ వర్థంతి కావడంతో.. హైదరాబాద్‌లోని ఘాట్‌‌లో వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు.

ప్రతీ ఏడు ఆయన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. అయితే ఈ సారి మాత్రం టీడీపీ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఆయన ఈరోజు ఉదయం రసూల్‌పుర చౌరస్తాలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు తెలంగాణ టీడీపీ నేతలు … నందమూరి సుహాసిని, టి.టీడీపీ నేతలు ఎల్. రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడా పాల్గొనడం విశేషం.

దీనితో ఆయన రాజకీయాల్లోకి రావడం ఖాయమంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొన్న ఆ మధ్య హరికృష్ణ కుమార్తెగా రాజకీయ అరంగేట్రం చేసిన సుహాసిని ఓటమి పాలయ్యారు. రామకృష్ణ ఏ మేరకు రాజకీయాల్లో రాణిస్తారో చూడాలి.