Nandamuri Ramakrishnaమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం రాజధాని గ్రామం యర్రబాలెంకు చేరుకున్నారు. సతీసమేతంగా అక్కడకు చేరుకున్న బాబు మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు పాల్గొన్నారు.

చంద్రబాబు దంపతులతో పాటు… ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ కూడా వచ్చారు. ఆయన మాట్లాడుతుండగా… రైతుల దుస్థితి చూడలేకపోతున్నానని రామకృష్ణ కంటతడి పెట్టుకున్నారు. చంద్రబాబుతో పాటు ఎంపీ కేశినేని నాని, మాగంటి బాబు, గల్లా అరుణకుమారి, పంచుమర్తి అనురాధ, శ్రావణ్ కుమార్, వర్ల రామయ్య సభలో పాల్గొన్నారు.

నూతన సంవత్సరం అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలన్నారు. నిర్మాణాత్మక రాజకీయపార్టీగా టీడీపీ పనిచేయాలని తెలిపారు. అమరావతిని కాపాడుకోవాలని, ఆంధ్రప్రదేశ్‌ను రక్షించుకోవాలి అని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండి ఆ ఖర్చులు రైతులు, రైతుకూలీల కోసం పనిచేసే జేఏసీలకు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

మరో వైపు రాజధాని రైతుల నిరసనలు పదిహేనవ రోజుకు చేరుకున్నాయి. నూతన సంవత్సర వేడుకలను కూడా పక్కన పెట్టి రైతు కుటుంబాలు ధర్నాలు చేస్తున్నాయి. రైతుల ఆందోళనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటివరకూ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విశేషం.