Nandamuri Mokshagnyaనందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి ఎప్పటినుండో ఆసక్తి ఉంది. బాలయ్య వారసుడు కావడంతో నందమూరి అభిమానులు దాని కోసం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నారు. అయితే ఇదిగో అదిగో అంటూ అది వాయిదా పడుతూ వస్తుంది. అది అలా ఉంచితే అప్పుడప్పుడు మోక్షజ్ఞ ఫోటోలు బయటకు వచ్చి ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడుతున్నాయి.

మోక్షజ్ఞ పర్సనాలిటీ చూస్తే అసలు హీరో మెటీరియల్ లా లేడు. కనీసం అతనికి సినిమాల మీద ఇంట్రెస్టు ఉన్నట్టు కూడా అనిపించడం లేదు. దానితో వేరే హీరో అభిమానులు నందమూరి ఫ్యాన్స్ ను రాగ్గింగ్ చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది ఇదే. తాజాగా ఇంకో ఫోటో సోషల్ మీడియా వైరల్ అవుతుంది.

మోక్షజ్ఞతో పాటు బాలయ్య, సతీమణి వసుంధర, కుమార్తె తేజస్విని, బాలయ్య అల్లుడు భరత్ కూడా ఉన్నారు. మోక్షజ్ఞ కంటే భరత్ కూడా ఫిట్ గా ఉండడం ఫ్యాన్స్ అసలు జీర్ణించుకోలేకపోతున్నారు.బాలయ్య కుమార్తె తేజస్విని కూడా చాలా ఫిట్ గా ఉంది.

మోక్షజ్ఞ ఓవర్ వెయిట్ గా ఉండడంతో మరోసారి నందమూరి అభిమానులకు రాగ్గింగ్ మొదలయ్యింది. అయితే కొందరు ఫ్యాన్స్ మాత్రం అసలు సినిమాలలోకి రావాలని నిర్ణయించుకుంటే సెలబ్రిటీలకు తగ్గడం ఎంతసేపు అని అభిప్రాయపడుతున్నారు.