Nandamuri -Kalyan Ram - Vakkantham VamsiNandamuri -Kalyan Ram - Vakkantham Vamsiరచయితగా ఇండస్ట్రీలో ఆదరణ పొందిన వక్కంతం వంశీ, తాజాగా ‘నా పేరు సూర్య’ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకులు విభిన్న స్పందనలు వ్యక్తం చేయగా, బాక్సాఫీస్ ఫలితం తెలియాలంటే ఈ వీకెండ్ వరకు ఆగాల్సిందే. అయితే అసలు వక్కంతం వంశీ మొదటి సినిమా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేయాల్సి ఉన్న విషయం తెలిసిందే. తెరవెనుక ఏం జరిగిందో గానీ, ఉన్నట్లుండి అల్లు అర్జున్ తెరపైకి రావడం, సెట్స్ పైకి వెళ్ళడం, షూటింగ్ జరగడం అలా జరిగిపోయాయి.

అయితే గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాపై ఓ స్పష్టమైన ప్రకటన చేసారు. తనను చాలా మంది ఈ ప్రశ్నను అడుగుతున్నారని మొదలుపెట్టిన కళ్యాణ్ రామ్… “వక్కంతం వంశీ చెప్పిన లైన్ ఎన్టీఆర్ కు, తనకు బాగా నచ్చిందని, దానిని డెవలప్ చేసే క్రమంలో కొన్ని చేంజెస్ చెప్పామని, సిట్టింగ్స్ కోసం వంశీ, తారక్ కు గోవా కూడా వెళ్ళారని, అంతా స్మూత్ గా జరుగుతున్న నేపధ్యంలో… తాను స్పెయిన్ కు వెళ్ళానని, ఆ తర్వాత వక్కంతం వంశీ నుండి ఇప్పటివరకు స్పందన లేదని” స్పష్టం చేసారు.

స్క్రిప్ట్ ను ఏప్రిల్ లోనే ఫైనల్ చేసామని, తారక్ తో సినిమా అంటే బహుశా మరొకరు అయితే అడిగిన చేంజెస్ చేసేవారేమోనని, మేమిద్దరం సినిమా చేద్దాము అనుకున్న తర్వాత, కొన్ని నెలల పాటు అలా తారక్ ను ఖాళీగా ఉంచలేనని, అందుకే ఆ సినిమా అలా జరిగిపోయిందని చెప్పుకొచ్చారు. దాదాపుగా ఏడాది క్రితం చేసిన ఈ ప్రకటన, ప్రస్తుతం “నా పేరు సూర్య” టాక్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఏది ఏమైనా తారక్ ఫ్యాన్స్ ఒకందుకు సంతోషంగానే ఉన్నారేమో!