nandamuri harikrishna daughter suhasini to- contest from kukatplally constituencyకూకట్‌పల్లి నియోజకవర్గ అభ్యర్థిగా దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పేరును తెలుగుదేశం ప్రకటించింది. శనివారం ఆమె నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. మెను బరిలోకి దింపాలని నిర్ణయించే ముందు హరికృష్ణ తనయులు, సినీనటులు కళ్యాణ్‌రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌లతోనూ చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. నందమూరి కుటుంబం నుంచి తెలంగాణ ఎన్నికల్లో ఒకరు పోటీచేస్తే తెదేపాకే కాకుండా మహాకూటమికి సైతం ఊపు వస్తుందని తెదేపా వర్గాలు భావిస్తున్నాయి.

ఎన్టీఆర్ తరువాత తెలంగాణ నుండి పోటీ చేస్తున్న మొదటి నందమూరి కుటుంబసభ్యులు సుహాసిని కావడం విశేషం. అసలు ఎవరీ సుహాసిని? దివంగత నేత హరికృష్ణ కూతురు. ఆవిడ అసలు సీత రావమ్మ తరువాత సుహాసినిగా పేరు మార్చుకున్నారు. సుహాసిని హైదరాబాద్‌లోనే న్యాయవిద్యలో డిగ్రీ చదివారు. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కుమారుడు చుండ్రు శ్రీకాంత్ ను వివాహం చేసుకున్నారు. చుండ్రు శ్రీహరి 1984-89 మధ్య టీడీపీ నుండి ఎంపీగా గెలిచి, 1989లో ఓడిపోయారు.

అయితే ఆ తరువాత ఆయన రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. కాకపోతే తూర్పు గోదావరి జిల్లాలో శ్రీహరి ఛారిటబుల్ ట్రస్ట్ పేరిట ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. చుండ్రు శ్రీహరి జై సమైక్యఆంధ్ర పార్టీని రిజిస్టర్ చేశారు. అన్ని పార్టీలలోని సమైక్యవాదులను ఒక తాటిపై తేవడానికి ఆ పార్టీ పెట్టారు. అయితే ఆయనను సంప్రదించి కిరణ్ కుమార్ రెడ్డి ఆ పార్టీని తీసుకున్నారు. ఈ క్రమంలో సుహాసిని రాజకీయ నేపధ్యం నుండి వచ్చిన మహిళే. చూడాలి ఆవిడ రాజకీయ భవితవ్యం ఎలా ఉండబోతుందో?