Nandamuri Balakrishna - Veteran actress jamunaగత వారంలో ఒక్క కామెంటు తో నందమూరి బాలకృష్ణ వార్తలలో నిలిచారు. పరిశ్రమలో జరుగుతున్న మీటింగులకు తనను ఎవరు పిలవలేదని చెప్పారు. అక్కడితో ఆపేస్తే పర్లేదు… హైదరాబాద్ లో కూర్చుని భూములు పంచుకుంటున్నారా అనే పరుషమైన వ్యాఖ్య కూడా చేసి పెద్ద దుమారమే రేపారు.

బాలయ్య చేసిన కామెంట్లకు నాగబాబు గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ‘భూముల పంపిణీ’ వ్యాఖ్యకు బాలయ్య బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ తరువాత నాగబాబు టీడీపీపై చేసిన కామెంట్లు పెద్ద దుమారమే లేపింది. సోషల్ మీడియాలో అయితే చిన్న సైజు యుద్ధమే జరుగుతుంది.

బాలయ్య ని తప్పు పడుతున్న వారు ఉన్నారు. అయితే బాలయ్య అంటే ఈ యాంగిలే కాదు… మరుసటి తరం హీరోయిన్ జామున బాలయ్య గురించి ఒక ఇంటర్వ్యూ లో చాలా గొప్పగా చెప్పారు. “వారం క్రితం బాలయ్య బాబు ఫోన్‌ చేసి ‘‘అమ్మా ఎలా ఉన్నారు’’ అని నా యోగక్షేమాలన్నీ అడిగారు. ఆయన నన్ను ఒక తల్లిలా గౌరవిస్తారు. బాలయ్యకి పెద్దలంటే ఎంతో మర్యాద. కాబట్టే కదా, ఈ ఆపద సమయంలో నేను ఎలా ఉన్నానో అని ఫోన్‌ చేసి మరీ పలకరించారు,” అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

“వాళ్ల నాన్న సంస్కారాన్నంతా బాలయ్య పుణికిపుచ్చుకున్నాడు. ఎన్టీఆర్‌ గారు కూడా అంతే, లేడీ్‌సని ఎంతో గౌరవించేవారు. సెట్‌లో లైట్‌బాయ్‌, టీ, కాఫీలు అందించే ప్రొడక్షన్‌ బాయ్‌ని కూడా ‘మీరు’ అని పిలిచేవారు. ఆ మహనీయుడి తీరే వేరు,” అని ఆవిడ చెప్పుకొచ్చారు. ఇది విన్నాకా బాలయ్యలో ఆ యాంగిల్ ఉంది… ఆ యాంగిల్ కూడా ఉంది అనకుండా ఉండలేము.