Balakrishna Unstoppableబుల్లితెరపై ‘అన్ స్టాపబుల్’ అంటూ నందమూరి నటసింహం చేసిన సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మంచు ఫ్యామిలీతో మొదలుపెట్టి, ఆ తదుపరి నాచురల్ స్టార్ తో హంగామా చేసిన బాలయ్య షోకు మూడవ వారం బ్రేకులు పడ్డాయి.

కొన్ని అనివార్య కారణాల వలన ఈ వారం షో రావడం లేదని ఆహా ప్రకటించింది. అప్పటివరకు గత రెండు షోలను ఎంజాయ్ చేయండి అంటూ ఆహా చేసిన ప్రకటనపై బాలయ్య ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా మండిపడుతున్నారు.

Also Read – ఆఫర్లు ఆర్డర్లకు మాత్రమే అంటా..!


బాలయ్యతో మూడవ వారం షో విజయ్ దేవరకొండ గానీ, మెగాస్టార్ చిరంజీవితో గానీ లీకులు రావడంతో, వీక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు. ఇపుడు దానికి బ్రేకులు పడడంతో విమర్శల పర్వం మొదలైంది. ఆహాలో ఈ వారం ‘మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్’ ప్రదర్శితం అవుతుండడంతో, ఈ వారానికి తాత్కాలిక విరామాన్ని ఇచ్చినట్లుగా తెలుస్తోంది.