nandamuri balakrishna responds on his angry attitudeప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు కోపం చాలా ఎక్కువ అన్నది సినీ ఇండస్ట్రీ టాక్. ఇటీవల మీడియాతో ముచ్చటించిన సందర్భంగా, బాలయ్యను ఇదే ప్రశ్న అడిగారు మీడియా ప్రతినిధులు… ‘మీకు కోపం ఎక్కువ అనే వాదనతో ఏకీభవిస్తారా?’ అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు నందమూరి నటసింహం.

“నాకు కోపం ఎక్కువని చాలా మంది అనుకుంటుంటారు. అందులో ఏమాత్రం నిజం లేదు. వాస్తవానికి నేను చాలా సరదాగా ఉంటా. ప్రజలందరితో చాలా త్వరగా కలసిపోతా. ఇంట్లో కూడా తన పిల్లలు తనను ఇమిటేట్ చేస్తే నవ్వుతూ సంతోషిస్తా. నా సినిమాల గురించి కుటుంబ సభ్యులు ఎలాంటి భయం లేకుండా తమ అభిప్రాయాలను చెబుతుంటారు” అని సమాధానమిచ్చారు.

ఈ సినిమాలో ఒక్క నెగెటివ్ పాయింట్ కూడా లేదని తన కుటుంబ సభ్యులు చెప్పడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపిన బాలయ్య, ఎమ్మెల్యేగా, బసవతారకం ఆసుపత్రి పెద్ద దిక్కుగా బాధ్యతలను నిర్వహిస్తూ తాను చాలా బిజీగా ఉన్నానని… అందువల్ల సినీ పరిశ్రమలో సైతం తనకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరని చెప్పారు. తనకు అత్యంత సన్నిహితుడు మెగాస్టార్ చిరంజీవేనని బదులిచ్చారు.