Nandamuri-Balakrishna---NTR-movieస్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ “ఎన్టీఆర్” బయోపిక్ మూవీ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసి అందరికీ ఆశ్చర్యచకితులను చేసింది. క్రిష్ ఈ ప్రాజెక్ట్ ను చేపట్టిన తర్వాత మొత్తం రూపమే మారిపోయిందన్న విషయం ఈ పోస్టర్ లో స్పష్టంగా కనపడుతోంది. నిజానికి ఎన్టీఆర్ ను ఇంత పర్ ఫెక్ట్ గా బాలకృష్ణ రూపంలో చూపిస్తారనేది ముందుగా అంచనా వేసింది కాదు.

ఎన్టీఆర్ ట్రేడ్ మార్క్ హవాభావంతో రిలీజ్ అయిన ఈ పోస్టర్ లో బాలయ్య కంటే కూడా ఎన్టీఆరే ఎక్కువగా కనిపిస్తున్నారని చెప్పవచ్చు. కాషాయ వస్త్రధారణలో మైమరిపిస్తున్న ఈ బాలయ్య పిక్, నందమూరి అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ పోస్టర్ లో ఉన్న పర్ ఫెక్ట్ నెస్ తో ఈ బయోపిక్ పై అంచనాలు నానాటికి పెరుగుతున్నాయి.