Balakrishna- New Look--నందమూరి బాలకృష్ణకు జుట్టు సమస్య ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. అందుకే ఆయన తన సినిమాలలో విగ్ వాడుతూ ఉంటారు. అయితే ఒక్కోసారి విగ్ సెట్ కాకపోతే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఆయన చిత్రం ‘రూలర్’ విషయంలో కూడా అదే జరిగింది. దీనితో బాలయ్య హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారట.

ఇటీవలే బాలయ్య గుండుతో కనిపిస్తున్నారు. అయితే అది ఆయన తన తదుపరి చిత్రం కోసమని అంతా అనుకున్నారు. అయితే హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం జుట్టు తీసేసినట్టు సమాచారం. తొందరలో దుబాయ్ లో ఈ ప్రక్రియ పూర్తి చెయ్యబోతున్నారట. మరోవైపు ఫిబ్రవరి 15 నుండి బోయపాటి శ్రీను దర్శకత్వంలోని ఆయన తదుపరి చిత్రం సెట్స్ మీదకు వెళ్తుంది.

గతంలో బోయపాటి జయజానకి నాయక సినిమాను నిర్మించిన మిర్యాల రవీంద్రరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలకృష్ణ కేరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ చిత్రంగా రూపొందించనున్నారు. సింహా – లెజెండ్ సినిమాలతో బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్ కి ఎంతగా క్రేజ్ వచ్చిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

బాలకృష్ణ హీరోయిజాన్ని ప్రేక్షకులకు సరికొత్తగా చూపించి మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు బోయపాటి. ఇప్పుడు వారి కాంబినేషన్ లో కావడంతో ఈ సినిమా మీద అంచనాలు బాగా ఉన్నాయి. ఈ చిత్రంలోని హీరోయిన్లు ఇంకా కంఫర్మ్ కాలేదు. జులై 31న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.