Nandamuri Balakrishna - NBK105నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మిస్తోన్న చిత్రం ఇప్పటివరకు టైటిల్ ప్రకటించలేదు. రూలర్ అని, రాయలసింహా అని ఏవేవో పేర్లు వినిపించాయి. అయితే సినిమా బృందం మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. తాజగా సినిమాకు సంబంధించిన మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది.

ఈ సినిమాకు జడ్జ్మెంట్ అనే టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. టీజర్ కూడా విడుదల కాకముందే నైజాం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఏరియాల బిజినెస్ పూర్తి అయిపోయింది. మరోవైపు ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ అక్టోబ‌ర్ 18 నుండి రామోజీ ఫిలిమ్ సిటీలో జ‌ర‌గ‌నుంది. ఈ షెడ్యూల్ కోసం ఆర్ట్ డైరెక్ట‌ర్ చిన్నా భారీ విలేజ్ సెట్‌ను వేశారు.

సినిమా విడుదల ఎప్పుడు అనేది కూడా ఇప్పటివరకూ చిత్రబృందం ప్రకటించలేదు. అయితే క్రిస్మస్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకూ దాదాపుగా అరడజను పైగా సినిమాలు తాము క్రిస్మస్ కు వస్తున్నట్టుగా ప్రకటించాయి. నవంబర్ లో ఏవి పోటీలో ఉంటాయి అనే దాని మీద క్లారిటీ రావొచ్చు.

సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, భూమిక చావ్లా, జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలయ్య వందవ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణికి స్వరాలు కూర్చిన చిరంతన్ భట్ సంగీతం అందిస్తుండగా.. రామ్‌ప్రసాద్ కెమెరా వర్క్‌ను అందిస్తున్నారు.