Nandamuri Balakrishna in & as NTRఝాన్సీ లక్ష్మీ భాయ్ జీవితగాధతో తెరకెక్కుతోన్న “మణికర్ణిక” సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో కంగనా రనౌత్, వెన్నులో బిడ్డను కట్టుకుని గుర్రంపై సవారీ చేస్తూ కనిపించింది. ఝాన్సీ లక్ష్మీ భాయ్ అని చెప్పగానే ప్రజలకు ఏం గుర్తుకు వస్తుందో… సరిగ్గా అదే పోస్టర్ ను ఫస్ట్ లుక్ గా విడుదల చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మన తెలుగు దర్శకుడు క్రిష్ తెరకేక్కిస్తోన్న ఈ సినిమాను 2019 జనవరి 25వ తేదీన విడుదల చేస్తున్నట్లుగా ఈ పోస్టర్ ద్వారా ప్రకటించారు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి సినిమాతో కీర్తిప్రతిష్టతలు పొందిన క్రిష్ ఖాతాలో ఈ ‘మణికర్ణిక’ కూడా మకుటాయమానంగా నిలుస్తుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెప్తునాయి. ‘ఎన్టీఆర్’ బయోపిక్ ఫస్ట్ లుక్ తో టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిన క్రిష్, బాలీవుడ్ లోనూ ‘మణికర్ణిక’తో హల్చల్ చేస్తున్నాడు.