Nandamuri - Balakrishna - helps cancer patientనందమూరి నటసింహం బాలకృష్ణ క్యారెక్టర్ గురించి ఎన్నో వార్తలు వింటుంటాం. బయటకు ఎలా కనిపించినా బాలయ్య మనసు వెన్న అంటుంటారు చాలా మంది సినీ ప్రముఖులు. సీనియర్ హీరోగా నేటికీ తన సత్తా చాటుతూ…కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు బాలయ్యబాబు.

తాజాగా మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే బాలయ్య.. బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఓ చిన్నారికి ఉచితంగా వైద్యం అందించేందుకు ముందుకు వచ్చారు.

అజీజ్ అనే కుర్రాడు చదువుకుంటున్నాడు. అతని సోదరి బేగం బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతుందని తెలుసుకున్న అజీజ్ చదువు మధ్యలోనే మానేసాడు.

సోదరి బేగంను ఎలాగైనా కాపాడుకోవాలని కూలీ పని కి వెళ్తున్నాడు. కూలీ పనిచేయగా వచ్చిన డబ్బుతో తన సోదరికి ఆపరేషన్ చేయించాలన్నది అజీజ్ తపన.

అజీజ్ స్టోరీ తెలుసుకున్న బాలయ్య బాబు మనస్సు చలిచింది. బేగంకు బసవతారకం ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందిస్తానని వాగ్దానం చేశాడు. ఓ చిన్నారి ప్రాణం కాపాడటం కోసం బాలయ్య బాబు చేసిన పనికి పలువురి ప్రశంసలందుకుంటున్నారు.

ఇక అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె షో ద్వారా ఈ విషయం తెలుసుకున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా చిన్నారి బేగంకు ఉచితంగా విద్యను అందించేందుకు ముందుకు వచ్చారు.

ఈ విషయం తెలుసుకున్న బాలయ్య అభిమానులు కొట్టాలన్నా….పెట్టాలన్నా మా బాలయ్య బాబుకే సాధ్యం అంటూ మురిసిపోతున్నారు.