సరికొత్త ట్రెండ్ ను ప్రారంభించిన బాలయ్య!“అఖండ”తో అద్వితీయమైన సక్సెస్ ను సొంతం చేసుకున్న బాలయ్య, తాజాగా విశాఖలో వేడుక కూడా చేసుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్ని, ఊపును ఇచ్చిన ఈ సినిమాతో మరో ట్రెండ్ కు కూడా శ్రీకారం చుట్టారు బాలయ్య.

“అఖండ” సినిమాకు సంబంధించి తాజాగా మరో ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. “అఖండ సక్సెస్ రోర్” పేరుతో రిలీజ్ అయిన ఈ ట్రైలర్ అభిమానులకు కావాల్సిన హైలైట్ షాట్స్ తో నిండిపోయింది. సినిమాలో రెండు విభిన్న పాత్రలు పోషించిన బాలకృష్ణ సూపర్బ్ షాట్స్ ను రెండు నిముషాలలో కట్ చేసారు.

Also Read – మార్పులతో మార్కు చూపిస్తున్నారా..?

ఇప్పటివరకు రిలీజ్ కు ముందు వరకే ట్రైలర్స్ హంగామా ఉండేది. ప్రేక్షకులను ధియేటర్ల వరకు రప్పించడానికి టీజర్లు, గ్లిమ్స్, ట్రైలర్స్ ఇలా రకరకాల పేర్లతో సినిమాలోని హైలైట్స్ ని నింపి ఆకట్టుకునేవారు. ఒక్కసారి సినిమా రిజల్ట్ వచ్చిన తర్వాత సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా పబ్లిసిటీ అనేది పెద్దగా ఉండదు.

కానీ “అఖండ” అమోఘమైన విజయాన్ని అందుకున్న తర్వాత కూడా అభిమానులను దృష్టిలో పెట్టుకుని ఓ ట్రైలర్ ను కట్ చేసి అందించారంటే, చిత్ర యూనిట్ ఎంత సంతోషంలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. బహుశా ఇప్పటి నుండి సరికొత్త ట్రేండింగ్ కు ‘బాలయ్య అండ్ కో’ శ్రీకారం చుట్టినవారవుతారేమో! మరి “అఖండ” హైలైట్ షాట్స్ ను మీరూ ఓ సారి వీక్షించేయండి.

Also Read – శాంతమూర్తిగా చంద్రబాబు… క్యాడర్ ఊరుకుంటుందా..?