Nandamuri Balakrishna Akhanda Movie Trailer Release dateనందమూరి నటసింహం బాలకృష్ణ – బోయపాటి కాంభినేషన్ లో ‘హ్యాట్రిక్’ మూవీగా తెరకెక్కుతోన్న “అఖండ” మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. థమన్ అందించిన పవర్ ఫుల్ టైటిల్ సాంగ్ తో జోరుమీదున్న సినీ అభిమానులకు మరింత ప్రీతిపాత్రమైన సమాచారం అందుతోంది.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న “అఖండ” థియేటిరికల్ ట్రైలర్ ను ఈ నెల 15వ తేదీన విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన ఎడిటింగ్ కార్యక్రమాలలో దర్శకుడు బోయపాటి ప్రస్తుతం బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ తదుపరి ఈ మాసాంతంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు.

అయితే రిలీజ్ డేట్ ఎప్పుడా అని మాత్రం అడగకండి! ఆ ఒక్కటి మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ లో ఉంది. రిలీజ్ డేట్ డిసెంబర్ 2 లేక 17వ తేదీలలో ఉండొచ్చు అన్న సంగతులు తెలిసినవే అయినా… ప్రస్తుత ఇండస్ట్రీ టాక్ ప్రకారం 17వ తేదీ వరకు వేచిచూసే ధోరణిలో ‘అఖండ’ చిత్ర యూనిట్ లేదన్నట్లుగా తెలుస్తోంది. ట్రైలర్ తో పాటు రిలీజ్ డేట్ కూడా రివీల్ చేస్తే ఫ్యాన్స్ కు పండగే మరి!