bala-krishana-horse-ridingసంస్కృతి, సంప్రదాయాలకు నందమూరి నటసింహం ఎంత ప్రాధాన్యత ఇస్తారో తెలిసిన విషయమే. ఇటీవల లేపాక్షి ఉత్సవాలను ఘనంగా జరిపి వార్తల్లో నిలిచిన బాలయ్య, తాజాగా తెనాలిలో ఎడ్ల పందాలలో హుషారుగా పాలు పంచుకున్నారు. తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తెనాలిలో ఏర్పాటు చేసిన ఎడ్ల పందాలను బాలకృష్ణ లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా… అక్కడ ఉన్న గుర్రం ఎక్కి స్వారీ చేసి అభిమానులను అలరించాడు. బాలకృష్ణ గుర్రంపై స్వారీ చేస్తుంటే అభిమానులంతా వెంట వెళుతూ కేరింతలు కొట్టారు. ఇలాంటి సన్నివేశాలు సాధారణంగా సినిమాలలో మాత్రమే వీక్షించే అవకాశం ఉండడంతో… నిజంగా చేసిన బాలయ్య అభిమానానికి తెనాలి ప్రజానీకం ఫ్లాట్ అయ్యారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పై ఉందని, మన సంస్కృతి అంటే మక్కువ ఎక్కువని ఈ నందమూరి బుల్లోడు అభిప్రాయ పడ్డారు.