Namitha‘సొంతం’ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నమిత ‘సింహా’ సినిమా వరకు అనేక సినిమాల్లో నటించింది. అయితే రానూ రానూ నమిత శరీరాకృతి మారిపోవడంతో సగటు హీరోయిన్లకు ఉండాల్సిన లక్షణాలు దూరమయ్యాయి. దీంతో సహజంగానే దర్శక నిర్మాతలు మొహం చాటేశారు.

అయితే తన బాడీ షేపులను మార్చే ప్రక్రియలో నమిత ఉందన్న టాక్ కోలీవుడ్ వర్గాల్లో హల్చల్ చేసింది. ఆ వార్తలు నిజమనిపించే విధంగా తాజాగా సరికొత్త లుక్ లో దర్శనమిచ్చింది నమిత. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో ర్యాంప్ పై వయ్యారాలు ఒలకబోసిన నమిత ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

క్రీం కలర్ డ్రెస్ లో సరికొత్త షేపులతో బొద్దుగుమ్మ సౌందర్యం వీక్షకులను కట్టిపడేసిందంట. ఈ ఫోటోలు చూసిన తర్వాత…. సినిమాల్లో నటించకపోయినా పర్వాలేదు గానీ, ఇలా అప్పుడప్పుడు ప్రత్యక్షమైతే చాలు అనుకోవడం నమిత అభిమానుల వంతవుతోంది. హాట్ హీరోయిన్ గా నమితకు టాలీవుడ్, కోలీవుడ్ లో చెప్పుకోదగ్గ అభిమాన గణమే ఉంది మరి!