Naini Narshimha Reddyతెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రి నాయిని నరసింహారెడ్డికే అపద్దర్మ ముఖ్యమంత్రి దర్శనం దొరకడం లేదట. తనకు లేక తన అల్లుడికి ముషీరాబాద్ టిక్కెట్ ఇప్పించుకోవడానికి శతవిధాలా ప్రయత్నించినా కేసీఆర్ కలవడం లేదట. దీంతో కేటీఆర్ వద్ద తన ఆవేదన వెల్లగక్కుకున్నారట. అల్లుడు శ్రీనివాసరెడ్డి కాకపోతే తానైనా పోటీ చేస్తానని చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది.

అయితే సీటు వస్తుందని కేటీఆర్ చెప్పకుండా మీకు చెప్పకుండా ఎవరికీ సీటు ఇవ్వము అని మాత్రమే చెప్పారట. ఇన్నేళ్లు టీఆర్ఎస్‌లో కొనసాగి వారసుడిని తెచ్చుకోలేవా అంటున్నారని నాయని మీడియా ముందు వాపోయారు. అయితే కేసీఆర్ న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని నాయని చెప్పుకొచ్చారు.

మరోవైపు నాయని నరసింహారెడ్డి కాంగ్రెస్ కు వెళ్లడం ఖాయమని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన అల్లుడు ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్లినట్టు సమాచారం. కాంగ్రెస్ లోకి తెరాస సీనియర్ మోస్టు నేత వెళ్లడం జరిగితే ఒకరకంగా అది కారు పార్టీకి ఇబ్బంది కలిగించే అంశమనే అనుకోవాలి.