nagendra-prasad-sobha-poojitha-marriage-rumors-truthసినీ సెలబ్రిటీలపై పుకార్లు సహజమే. అయితే ఇవి శృతిమించనంత వరకు ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. కానీ, ఆ పరిధి దాటితే మాత్రం కాస్త చిరాకుగా అనిపిస్తాయి. ప్రస్తుతం కన్నడ హీరోయిన్ శోభా పూంజా, రచయిత నాగేంద్ర ప్రసాద్ ల పరిస్థితి ఇలాగే ఉంది. వీరిద్దరికీ పెళ్ళయిపోయింది అంటూ కొన్ని ఫోటోలను పోస్ట్ చేస్తూ ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాలలో ‘హ్యాపీ మారీడ్ లైఫ్’ విషెస్ చెప్తుంటే… ఆ ఇద్దరు సెలబ్రిటీలు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

‘మేము పెళ్లి చేసుకోలేదు బాబోయ్’ అంటూ హీరోయిన్ శోభా పూంజా, సినీ రచయిత నాగేంద్ర ప్రసాద్‌ లబోదిబోమంటున్నారు. చిత్రీకరణ దశలోనున్న కన్నడ చిత్రంలో నటిస్తున్న సందర్భంగా వీరిద్దరూ దిగిన ఫొటోలను కొంత మంది సామాజిక మాధ్యమాల్లో అప్‌ లోడ్‌ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, తనకు ఇదివరకే వివాహమైందని, ఈ విషయం తెలియని కొంత మంది అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

అలాగే శోభా పూంజా మాట్లాడుతూ, ఇంకా పేరుపెట్టని ఈ సినిమాలో నటించిన సన్నివేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అదండి… వీరిద్దరి హ్యాపీ మారీడ్ లైఫ్ అసలు కధ. సినిమా షూటింగ్ సన్నివేశాలతో ఆ ఇద్దరూ సెలబ్రిటీలకు ఎవరో పెళ్లి చేసేస్తే… అది చూసి అవాక్కవ్వడం ఆ ఇద్దరి సెలబ్రిటీల వంతయ్యింది.