Nagarjuna's Bangarraju movie releasing on sankrathi 2022వచ్చే సంక్రాంతి కి ఓ నాలుగు భారీ సినిమాల మధ్య గట్టి పోటీ ఉంటుందనుకున్నారు అంతా. ఒకరి తర్వాత ఒకరు మాది సంక్రాంతి సినిమా అంటే మాది సంక్రాంతి సినిమా అంటూ ఎనౌన్స్ చేస్తూ వెళ్లారు. కానీ ఇప్పుడు ఆ పోటీ జస్ట్ రెండు పాన్ ఇండియా సినిమాలకు మాత్రమే ఫిక్స్ అయింది.

ఉన్నపళంగా తన నెక్స్ట్ పాన్ ఇండియా సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’ ను 2022 సంక్రాంతి రేస్ లోకి తీసుకొచ్చాడు రాజమౌళి. వచ్చే ముందే మిగతా నిర్మాతలతో సంప్రదింపులు జరిపారు. ‘రాధేశ్యామ్’ మినహా అందరూ రాజమౌళి రిక్వెస్ట్ తో వెను తిరిగి సినిమాలను పోస్ట్ పోన్ చేసుకున్నారు.

కానీ ఇప్పుడు మరో బడా సినిమా కూడా సంక్రాంతి రేస్ లో దిగనుందని తెలుస్తుంది. నాగార్జున ‘బంగార్రాజు’ కూడా సంక్రాంతి కే థియేటర్స్ లోకి రానుందనే ప్రచారం గట్టిగా జరుగుతుంది. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్స్ అందరితో నాగ్ సంప్రదింపులు జరుపుతున్నాడని తెలుస్తోంది.

ఒక సంక్రాంతికి వచ్చి ‘సోగ్గాడే చిన్ని నాయన’ తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు నాగార్జున. అందుకే ఈ సీక్వెల్ ని కూడా సంక్రాంతి బరిలో దింపాలని చూస్తున్నాడు. అప్పుడెప్పుడో సంక్రాంతి రిలీజ్ అనుకుంటేనే సినిమా మొదలు పెడతాను అంటూ చెప్పుకున్నాడు కూడా.

కానీ ఆర్ ఆర్ ఆర్ ,రాధేశ్యామ్ మధ్యలో బంగార్రాజు ఉండదకున్నారు. కానీ ఇప్పుడు నాగ్ ఆలోచన మారిందట. తనతో పాటు చైతు కూడా నటిస్తుండటం ,విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పక్కా ఫ్యామిలీ సినిమా అవ్వడంతో ఎట్టిపరిస్థితుల్లో సంక్రాంతి కే రావాలని డిసైడ్ అయ్యాడట. అయితే ఆర్ ఆర్ ఆర్ , రాధేశ్యామ్ కోసం ఇప్పటికే థియేటర్స్ అన్నీ బుక్ అయ్యాయి. మరి వాటి మధ్యలో బంగార్రాజు కి థియేటర్స్ దొరకాదం కష్టమే. నాగ్ కనుక వంద నుండి రెండొందల థియేటర్స్ రావొచ్చు అంతే. మరి ఈ లిమిటెడ్ థియేటర్స్ లో అనుకున్న రెవెన్యూ వస్తుందా ? అంటే చెప్పలేం.

ప్రస్తుతానికి నవంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేసి ఫస్ట్ కాపీ రెడీ చేసే పనిలో ఉన్నాడు నాగ్. ఆ తర్వాత అన్నీ లెక్కలు కుదిరి థియేటర్స్ దొరికితే సంక్రాంతి బరిలో దిగే అవకాశం ఉంది. మరి నాగార్జున కి ఇంత ధైర్యమేమిటో ?