Jagan's-Counter-Plan-for-Chandrababu-Naidu's-Freebiesదివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగేవారు కింగ్ నాగార్జున. ఆయనకు అప్పటి ప్రభుత్వం కొన్ని అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడంతో నాగార్జున కొన్ని ప్రభుత్వ యాడ్లలో కూడా నటించారు. ఆ సమయంలో నాగార్జున రాజకీయ అరంగేట్రం చేస్తారని, ఆయనకు కాంగ్రెస్ లో సీటు రావడం ఖాయమని వార్తలు వచ్చాయి. అయితే వైఎస్ హఠాన్మరణంతో పరిస్థితులు మారిపోయాయి. నాగార్జున కూడా సైలెంట్ అయిపోయారు. అయితే ఇప్పుడు మళ్ళీ నాగార్జున రాజకీయ అరంగేట్రం గురించి వార్తలు వస్తున్నాయి.

గుంటూరు లోక్ సభ సెగ్మెంటులో సిట్టింగు ఎంపీ గల్లా జయదేవ్ ను ఎదురుకోవడానికి నాగార్జునను నిలబెట్టాలని జగన్ మోహన్ రెడ్డి అనుకుంటున్నారు. పార్టీలోకి వస్తే టిక్కెట్టు ఖాయమని ఇప్పటికే నాగార్జునకు జగన్ చెప్పినట్టు సమాచారం. అయితే ఆయన మాత్రం ఇప్పటి వరకు దాని పై స్పందించలేదట. దీనితో నాగార్జున ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కొడుకులు ఇప్పుడిప్పుడే సినిమాలలో పైకి వస్తుండగా నాగార్జున ఇలాంటి నిర్ణయం తీసుకుంటారో లేదో చూడాలి.

గల్లా జయదేవ్ సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు. మహేష్ బాబు బావ. ఆయన పైన నాగార్జున పోటీ అంటే పోటీ మంచి రసవత్తరంగా ఉండబోతుంది. నాగార్జునను ఎదురుకోవాల్సి వస్తే జయదేవ్ కోసం మహేష్ బాబు రంగంలోకి దిగుతారేమో. ఇటీవలే కృష్ణ తమ్ముడు ఆది శేషగిరి రావు కూడా వైఎస్సాఆర్ కాంగ్రెస్ ను వీడి త్వరలో తెలుగు దేశం పార్టీలో చేరబోతున్నారు. గల్లా జయదేవ్ స్థానికంగా అందుబాటులో ఉండదు అని నియోజకవర్గంలో కొంత అసంతృప్తి ఉన్నా ఆయనకు అక్కడి ప్రజలలో మంచి పేరే ఉన్నట్టు తెలుస్తుంది.